CBN: నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం

CBN: నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం
X
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే.. నేలకొరిగిన పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి.. నష్టం ఆరా తీసి రైతులకు ధైర్యం చెప్పిన సీఎం

మొం­థా తు­పా­ను పె­ను­వి­ప­త్త­ని.. రా­ష్ట్రా­ని­కి తీ­వ్ర­మైన నష్టం జరి­గిం­ద­ని ఏపీ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు. తు­పా­ను ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో ఏరి­య­ల్‌ సర్వే ని­ర్వ­హిం­చా­రు. అనం­త­రం రో­డ్డు­మా­ర్గం­లో వె­ళ్లి అం­బే­డ్క­ర్‌ కో­న­సీమ జి­ల్లా అల్ల­వ­రం మం­డ­లం ఓడ­ల­రే­వు­లో పు­న­రా­వాస కేం­ద్రా­న్ని పరి­శీ­లిం­చి, తు­పా­ను బా­ధి­తు­ల­ను పరా­మ­ర్శిం­చా­రు. బా­ధి­తు­ల­కు ని­త్యా­వ­స­రా­లు, పరి­హా­రం అం­దిం­చా­రు. ‘‘మొం­థా తు­పా­ను­పై ముం­దు­గా­నే ప్ర­ణా­ళిక సి­ద్ధం చే­సు­కు­న్నాం. గతం­లో తు­పా­నుల సమ­యం­లో పని­చే­సిన అను­భ­వం నాకు ఉంది. ముం­దు జా­గ్ర­త్త­లు తీ­సు­కు­ని ప్రాణ నష్టం లే­కుం­డా చూ­శాం. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గే­లా చర్య­లు తీ­సు­కు­న్నాం. పలు జి­ల్లా­ల్లో వరి, ఉద్యాన పం­ట­లు దె­బ్బ­తి­న్నా­యి. నె­ల్లూ­రు, ప్ర­కా­శం, బా­ప­ట్ల జి­ల్లా­ల్లో భారీ వర్షం నమో­దైం­ది. ఆస్తి నష్టం­పై ని­వే­దిక వచ్చాక చర్య­లు తీ­సు­కుం­టాం. కౌలు రై­తు­ల­కు పరి­హా­రం అం­ది­స్తాం. మత్స్య­కా­రు­లు, చే­నేత కా­ర్మి­కు­ల­కు అద­నం­గా 50 కి­లోల చొ­ప్పున బి­య్యం ఇస్తు­న్నాం’’ అని సీఎం తె­లి­పా­రు. హె­లి­కా­ప్ట­ర్ ద్వా­రా బా­ప­ట్ల, పల్నా­డు, కృ­ష్ణా, కో­న­సీమ, ఏలూ­రు జి­ల్లా­ల్లో సీఎం చం­ద్ర­బా­బు ఏరి­య­ల్ వి­జి­ట్ కొ­న­సా­గు­తుం­ది. చి­ల­క­లూ­రి­పేట, పర్చూ­రు, చీ­రాల, కో­డూ­రు, నా­గా­య­లంక మీ­దు­గా ఓడ­ల­రే­వు వరకు సీఎం చం­ద్ర­బా­బు హె­లి­కా­ఫ్ట­ర్ నుం­చి పరి­శీ­లిం­చా­రు. కో­న­సీమ జి­ల్లా, అల్ల­వ­రం మం­డ­లం ఓడ­ల­రే­వు­లో సీఎం ల్యాం­డ్ అవ­ను­న్నా­రు. అనం­త­రం ఓడల రేవు నుం­చి రో­డ్డు మా­ర్గాన ప్ర­యా­ణిం­చి వర్షా­ల­కు నీట ము­ని­గిన పంట పొ­లా­ల­ను అధి­కా­రు­ల­తో కలి­సి సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు పరి­శీ­లిం­చా­రు. తు­ఫా­న్ బా­ధి­తు­ల­ను పరా­మ­ర్శిం­చా­రు.. రో­డ్డు మా­ర్గం ద్వా­రా అల్ల­వ­రం మం­డ­లం బెం­డ­మూ­ర్లంక గ్రా­మా­ని­కి చే­రు­కు­న్న ఆయన.. తు­ఫా­న్ కు నే­ల­కొ­రి­గిన వరి పొ­లా­ల­ను పరి­శీ­లిం­చా­రు.. పంట నష్టా­ల­కు సం­బం­ధిం­చి రై­తు­ల­ను అడి­గి తె­లు­సు­కు­న్నా­రు.

ఇదీ పెను విపత్తు

ఇది పె­ను­వి­ప­త్తు.. రా­ష్ట్రా­ని­కి తీ­వ్ర నష్టం జరి­గిం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నారు. గతం­లో తు­ఫా­న్‌ల సమ­యం­లో పని­చే­సిన అను­భ­వం నా­కుం­ద­న్న ఆయన.. మొం­థా తు­ఫా­న్‌­పై ముం­దు­గా­నే ప్ర­ణా­ళిక సి­ద్ధం చే­సు­కు­న్నాం అన్నా­రు.. అయి­తే, ఈ తు­ఫా­న్‌ వల్ల రా­ష్ట్రా­ని­కి తీ­వ్ర­మైన నష్టం జరి­గిం­ద­న్నా­రు.. ఏరి­య­ల్ సర్వే తర్వాత మీ­డి­యా­తో మా­ట్లా­డిన ఆయన.. ముం­దు జా­గ్ర­త్త­లు తీ­సు­కు­ని మొం­థా తు­ఫా­న్‌ వల్ల ప్రాణ నష్టం లే­కుం­డా చూ­శాం అన్నా­రు.. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గే­లా చర్య­లు తీ­సు­కు­న్నాం అని వె­ల్ల­డిం­చా­రు.. పలు జి­ల్లా­ల్లో వరి, ఉద్యాన పం­ట­లు దె­బ్బ­తి­న్నా­యి.. నె­ల్లూ­రు, ప్ర­కా­శం, బా­ప­ట్ల జి­ల్లా­ల్లో భారీ వర్షం నమో­దైం­ద­న్నా­రు.. ఆస్తి నష్టం­పై ని­వే­దిక వచ్చాక చర్య­లు తీ­సు­కుం­టాం అని వె­ల్ల­డిం­చా­రు.. కౌలు రై­తు­ల­కు పరి­హా­రం అం­ది­స్తాం అన్నా­రు.. ఇక, మత్స్య­కా­రు­లు, చే­నేత కా­ర్మి­కు­ల­కు అద­నం­గా 50 కి­లోల చొ­ప్పున బి­య్యం ఇవ్వ­ను­న్న­ట్టు తె­లి­పా­రు.

నిత్యావసరాలు అందించండి

తు­పా­న్ ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో­ని ప్ర­జ­ల­కు ని­త్య­వ­సర సరు­కు­లు అం­దిం­చా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. కలె­క్ట­ర్లు, అధి­కా­రు­లు, మం­త్రు­ల­కు సూ­చ­న­లు చే­శా­రు. సమ­ర్థం­గా వ్య­వ­హ­రిం­చి నష్ట­ని­వా­రణ చర్య­లు చే­ప­ట్టా­మ­ని తె­లి­పా­రు. సీఎం నుం­చి సచి­వా­ల­యం సి­బ్బం­ది వరకు అం­ద­రం టీ­మ్‌­గా పని­చే­శా­మ­ని అన్నా­రు. మరో రెం­డు రో­జు­లు ఇలా­నే పర్య­టి­స్తే.. మరింత ఊరట ఇవ్వ­గ­ల­మ­ని చె­ప్పా­రు. తు­పా­న్ ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో పర్య­టిం­చా­ల­ని.. ప్ర­భు­త్వం ఏం చే­సిం­దో చె­బు­తూ సమ­స్య­లు ఉంటే అడి­గి తె­లు­సు­కో­వా­ల­ని మం­త్రు­లు అధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు. వి­విధ వి­భా­గా­ల్లో నష్టం అం­చ­నా వేసి కేం­ద్రా­ని­కి ని­వే­దిక అం­దిం­చా­ల­న్నా­రు. తు­పా­న్ కా­ర­ణం­గా ఇద్ద­రు మర­ణిం­చా­ర­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ప్ర­జ­లు కష్టా­ల్లో ఉన్న­ప్పు­డు అం­దు­బా­టు­లో ఉంటే ప్ర­భు­త్వం­పై నమ్మ­కం కలు­గు­తుం­ద­ని అన్నా­రు. మన చర్య­ల­తో ప్ర­భు­త్వం­పై భరో­సా పె­రి­గిం­ద­ని తె­లి­పా­రు. ముం­దు జా­గ్ర­త్త­ల­తో చాలా నష్టా­న్ని ని­వా­రిం­చ­గ­ల­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. సమ­ర్థం­గా వ్య­వ­హ­రిం­చి నష్ట ని­వా­రణ చర్య­లు చే­ప­ట్టా­మ­ని పే­ర్కొ­న్నా­రు. సీఎం నుం­చి సచి­వా­ల­యం సి­బ్బం­ది వరకు అం­ద­రం టీ­మ్‌­గా పని­చే­శా­మ­ని చె­ప్పా­రు.

Tags

Next Story