CBN: రప్పా రప్పా అని రంకెలేస్తే ఊరుకుంటామా..?

నకిలీ రాజకీయాలతో మోసం చేయాలని వైకాపా చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబుఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభలో సీఎం ప్రసంగించారు. ‘‘వైసీపీ ఉనికి కోల్పోతోంది. పార్టీ ఆఫీసులు మూసుకొని.. సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారు. ఎన్నికల సమయంలో సిద్ధం.. సిద్ధం అని ఎగిరిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి.. ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది నేను కాదు.. ప్రజలు. అసెంబ్లీకి రాని వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? అసెంబ్లీకి రాకుండా.. రప్పా రప్పా అంటూ రంకెలేస్తున్నారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకుంటామా?.. ఇక్కడ ఉన్నది సీబీఎన్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు." అని చంద్రబాబు అన్నారు. మెడికల్ కాలేజీలపై అసెంబ్లీలో చర్చకు రావాలని జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత కూడా తమదే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఉనికి కోల్పోతోంది. వైసీపీ ఆఫీసులు మూసేసి సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. మేం కాదు. వైసీపీ నేతలకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందా? అని సవాల్ చేశారు. అసెంబ్లీకి రాకుండా రప్పారప్పా అంటూ రంకెలేస్తున్నారు.. ఇక్కడ ఉన్నది చంద్రబాబు, పవన్ కల్యాణ్.. బెదిరింపులకు తాము భయపడే వ్యక్తులం కాదని హెచ్చరించారు. ఒంటిమిట్ట, పులివెందులలో ప్రజలు మీ బెండు తీశారు. హింసా రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
"పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో వైకాపా బెండు తీశారు. సీమలో 52 సీట్లకు.. 45 సీట్లు కూటమి ప్రభుత్వమే గెలిచింది. హింసారాజకీయాలు చేస్తే.. చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాది. వైసీపీ అధినేతది ధ్రుతరాష్ట్ర కౌగిలి.. ఆయనను నమ్మితే నాశనమే. అనంతపురం అభివృద్ధికి బ్లూప్రింట్ తయారు చేశాం. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కుప్పానికి తీసుకెళ్లాం. ఐదేళ్లలో వైకాపా చేయలేని పనిని.. 100 రోజుల్లో పూర్తి చేశాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ. రాయలసీమలో శాశ్వతంగా కరవు నివారిస్తాం." అని చంద్రబాబు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com