AP Secretariat: జగన్ సర్కారుకి కేంద్రం పెద్ద షాక్

AP Secretariat: జగన్ సర్కారుకి కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. పంచాయతీలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విత్‌డ్రా చేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 15వ ఆర్ధిక సంఘం నిధులకు పంచాయతీలు ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను ఆ ఖాతాలకే జమ చేస్తామని కేంద్రం తెలిపింది.
14, 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన 1300 కోట్ల రూపాయల నిధులను విద్యుత్ బకాయిల పేరిట పంచాయతీల నుంచి డ్రా చేసింది జగన్ ప్రభుత్వం. దీంతో ఇకపై విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలు తెరిచే ప్రత్యేక అకౌంట్లకే జమచేయాలని నిర్ణయించింది. 14వ ఆర్ధిక సంఘం ఇచ్చిన 356 కోట్లతో పాటు, 15వ ఆర్ధిక సంఘం ఇచ్చిన 944 కోట్లను జగన్ ప్రభుత్వం విద్యుత్ బకాయిల పేరుతో జమచేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com