కాకినాడ జిల్లాలో కేంద్ర మంత్రి మురళీధరన్ పర్యటన

కాకినాడ జిల్లాలో కేంద్ర మంత్రి మురళీధరన్ పర్యటన
కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ కాకినాడ జిల్లాలో పర్యటించారు.

కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఫక్రుద్దీన్‌పాలెంలో అమృత్ సరోవర్‌ నిధులతో నిర్మించిన మంచినీటి ట్యాంకు, చెరువును పరిశీలించారు. ఆ తర్వాత పనికి ఆహారం పథకం కూలీలను కలుసుకున్నారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని పెనుమర్తిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. అక్కడున్న చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. గర్భిణిలకు పసుపు, కుంకుమ, వస్త్రాలను అందజేశారు. తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story