సార్ లేవండి.. ప్రధాని మాట్లాడుతున్నారు..

సార్ లేవండి.. ప్రధాని మాట్లాడుతున్నారు..
నిద్ర సుఖమెరగదు.. ఆకలి రుచెరగదు.. సామెత ఊరికే వచ్చిందా ఏవిటి.. ప్రధాని ప్రసంగిస్తే ఏమి.. మీడియా ఫోకస్ చేస్తే ఏమి.

నిద్ర సుఖమెరగదు.. ఆకలి రుచెరగదు.. సామెత ఊరికే వచ్చిందా ఏవిటి.. ప్రధాని ప్రసంగిస్తే ఏమి.. మీడియా ఫోకస్ చేస్తే ఏమి.. కళ్లు మూతలు పడుతున్నాయి ఏం చెయ్యాలి. పక్కన వాళ్లు లేపుతున్నా పట్టించుకోలేదు.. వేదికలపై, అసెంబ్లీ, పార్లమెంట్ సభలలో మంత్రులు కునుకు తీయడం షరా మామూలే..

తాజాగా విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయ సమీపంలోని ఆడిటోరియంలో మంగళవారం రోజ్ గార్ మేళా జరిగింది. కార్యక్రమాన్ని దిల్లీ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తున్నారు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్. ఎదురుగా లేరు, వీడియోలోనే కదా చూసేది అనుకుని కాసేపు స్లీపేశారు. ప్రధాని కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగిస్తున్నంతసేపు మంత్రి గారు నిద్రిస్తూనే ఉన్నారు. అధికారులు మధ్య మధ్యలో సార్ లేవండి అని మేల్కొలిపే ప్రయత్నం చేసినా జోలపాటలా భావించారేమో హాయిగా ఓ కునుకేశారు, కెమెరా కంటపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story