ఏపీలో జరిగిన ఘటనలను కేంద్రం దృష్టికి తీసుకెళతా : కన్నా లక్ష్మీనారాయణ

ఏపీలో జరిగిన ఘటనలను కేంద్రం దృష్టికి తీసుకెళతా : కన్నా లక్ష్మీనారాయణ
బీజేపీ చలో అమలాపురం కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెట్టినా కొందరు నేతలు అక్కడికి చేరుకున్నారు. అమలాపురం నడిబొడ్డున..

బీజేపీ చలో అమలాపురం కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెట్టినా కొందరు నేతలు అక్కడికి చేరుకున్నారు. అమలాపురం నడిబొడ్డున ఉన్న గడియార స్తంభం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యదర్శులు రమేష్ నాయుడు, సాదినేని యామినిలను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు, బీజేపీ నేత రఘురాం బైక్‌పై వ్యాపారి వేషంలో వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ను గుర్తుపట్టి అడ్డుకున్నారు.

నిన్న సాయంత్రం నుంచే బీజేపీ ముఖ్యనేతలందరికీ నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కొందర్ని గృహనిర్బంధం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి సహా అందరినీ ఎక్కడికక్కడే కట్టడి చేశారు. ఎట్టిపరిస్థితుల్లో గడియార స్తంభం వద్ద నిరసన తెలిపి తీరతామంటున్న BJP శ్రేణులు.. ర్యాలీగా వచ్చేందుకు ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతర్వేది ఘటనలో అరెస్టు చేసిన 41 మందిని విడుదుల విడుదల చేయాలని ఏపీ BJP మాజీ అధ్యక్షుడు కన్నా డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ఈ ఘటనలను కేంద్రం దృష్టికి కూడా తీసుకు వెళ్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలతో హిందువులను వాడుకుంటోందని కన్నా మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story