Chandra Babu : జగన్‌రెడ్డి గ్యాంగ్‌ కొండల్ని తవ్వేస్తోంది : చంద్రబాబు

Chandra Babu : జగన్‌రెడ్డి గ్యాంగ్‌ కొండల్ని తవ్వేస్తోంది : చంద్రబాబు
X
Chandra Babu : జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని తవ్వేసి చెరువులుగా చేసేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Chandra Babu : జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని తవ్వేసి చెరువులుగా చేసేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చెట్లని కొట్టేస్తే పెంచొచ్చు.. కొండల్ని తవ్వేస్తే ఎలా.. అని ప్రశ్నించారు. విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండను ధ్వంసం చేశారని మండిపడ్డారు. కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారికి కూడా అంతుబట్టని విధంగా రవ్వల కొండను తవ్వేశారని అన్నారు.

కాకినాడలో మడ అడవులు కొట్టేశారని.. ప్రకృతి నాశనం అయ్యేలా వ్యవహరిస్తోన్న అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారని ఫైరయ్యారు. కుప్పంలో కూడా ఇదే తరహాలో తవ్వేస్తున్నారని చెప్పారు. వైసీపీకి కండకావరం పెరిగిందంటూ నిప్పులు చెరిగారు.

Tags

Next Story