Chandra Babu : ప్రశ్నిస్తే కులముద్ర వేయడం జగన్‌కు అలవాటుగా మారింది : చంద్రబాబు

Chandra Babu : జగన్ సర్కారు తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. పోలీసు కేసులతో విపక్ష నేతలను భయపట్టే ప్రయత్నం జగన్ సర్కార్ చేస్తోందని ధ్వజమెత్తారు. కొంతమంది పోలీసులు ఉన్మాదంతో ఇష్టానుసారం అక్రమ కేసులు నమోదుచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఆ పార్టీ నేతలే తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు ప్రజలందరూ టీడీపీతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే తనపై కులముద్ర వేస్తారా అంటూ ఫైరయ్యారు చంద్రబాబు. ప్రశ్నిస్తే కులముద్ర వేసి ఆయా అంశాలను మళ్లించడం అలవాటుగా మారిందన్నారు. జగన్ విధానాలను ప్రశ్నిస్తున్నారని కాపులను తిడుతున్నారు, రేపు రెడ్లు ప్రశ్నిస్తే వారినీ తిడతారన్నారు. అన్ని కులాలు తనవే అన్న ఉద్దేశ్యంతో ఏపీని అభివృద్ధి చేశానన్నారు.
అంతకుముందు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్ రెడ్డి టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు... గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కల్పి సాదరంగా ఆహ్వానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com