Chandra Babu : ఢిల్లీకి పయనమైన చంద్రబాబు..

Chandra Babu : టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ముర్ముతో చంద్రబాబు భేటీకానున్నారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు రాష్ట్రపతి భవన్‌లో... ప్రధాని నేతృత్వంలో జరిగే.. ఆజాదీకా మహోత్సవ్ కమిటీ భేటీలో చంద్రబాబు పాల్గొననున్నారు.
75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.
లిఖితపూర్వక ఆహ్వానం పంపడంతో పాటు ఫోన్ కూడా చేసి చంద్రబాబును ఆహ్వానించారు. అటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతోపాటు ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. మొత్తం 240 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
అటు చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అటు ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనూ ఎంపీలు చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com