Kuppam Anna Canteen : కుప్పంలో అన్న క్యాంటీన్‌ను మళ్లీ ప్రారంభించిన చంద్రబాబు..

Kuppam Anna Canteen : కుప్పంలో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా ధ్వంసం చేసిన అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు మళ్లీ ప్రారంభించారు. పలువురికి అన్న విచారణ చేశారు. నిరుపేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తే... వాటిని వైసీపీ కూల్చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలనే దురుద్దేశంతో అన్న క్యాంటీన్‌ను... వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో అన్న క్యాంటీన్ దగ్గర చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నవారిపై దాడి చేయడాన్ని తప్పుబట్టారు.
రాష్ట్రాన్ని సీఎం జగన్ అతలాకుతలం చేయాలనుకుంటున్నారని, ఖబడ్దార్ జగన్ రెడ్డి అంటూ హెచ్చరించారు టీడీపీ చంద్రబాబు. మగాళ్లైతే, దమ్ము ధైర్యం ఉంటే.. ఇప్పుడు చూసుకుందాం రా అంటూ సీఎం జగన్, రామచంద్రారెడ్డి, డీజీపీకి సవాల్ విసిరారు. మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావ్ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. తనపైనే దాడి చేయడానికి ప్రయత్నించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓవైపు వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే.. పోలీసుల కళ్లకు కనపడలేదా అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com