Chandra Babu: ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు..

Chandra Babu: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన చంద్రబాబు..నాదెండ్ల గ్రామానికి చేరుకుంటారు.
అక్కడ దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ముచ్చటిస్తారు. అక్కడ నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అక్కడి నుంచి తూబాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పంట పోలాలను పరిశీలించి..నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు.
తర్వాత నరసరావుపేట, మల్లమ్మ సెంటర్, పల్నాడు రోడ్, రావిపాడు, నకరికల్లు, కొండమోడు, పిడుగురాళ్ల, దాచేపల్లి మీదుగా గురజాలకు వెళ్తారు. అక్కడ కూడా దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. సాయంత్రం గురజాలలో నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com