అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదు: చంద్రబాబు

అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదు: చంద్రబాబు
పంచాయతీ ఎన్నికల్లో బైండోవర్ కేసులు, అపహరణలతో అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు.

పంచాయతీ ఎన్నికల్లో బైండోవర్ కేసులు, అపహరణలతో అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో.. పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం పౌరులుగా మనందరి బాధ్యత అని.. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగమే మనల్ని కాపాడుతుందన్నారు చంద్రబాబు. తాడోపేడో తేల్చుకోడానికి సిద్దంగా ఉండాలని.. వాలంటీర్ల ద్వారా ప్రలోభపెట్టాలని చూసే కుట్రలను తిప్పికొట్టి.. వాటిపై ఎక్కడికక్కడ ప్రతిచోటా ఫిర్యాదులు చేయాలన్నారు చంద్రబాబు.

పంచాయితీ ఎన్నికలను ప్రతిఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని.. వైసీపీ గూండాల చేతుల్లోకి మన గ్రామాలు వెళ్తే ప్రతి పల్లెకు కన్నీరే మిగుల్తుందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. వైసీపీ వాళ్లు గెలిస్తే ఊళ్లన్నీ వల్లకాడు చేస్తారని మండిపడ్డారు. సమర్ధులైన వాళ్లే సర్పంచులుగా ఎన్నికయ్యేలా చూడాలని సూచించారు. టిడిపి ద్వారానే నిజమైన గ్రామస్వరాజ్యం వస్తుందన్నారు చంద్రబాబు. నాయకత్వ సామర్ధ్యానికి పరీక్ష.. గ్రామ పంచాయితీ ఎన్నికలేనని అన్నారయాన.

భవిష్యత్తులో నాయకులుగా ఎదిగే వేదికలు గ్రామ పంచాయితీలేనని.. ప్రతి సర్పంచి తన ఐదేళ్లలో 5 కోట్లకు పైగా నిధులతో ప్రతిఊళ్లో అభివృద్ది చేసుకోవచ్చన్నారు చంద్రబాబు. ఇవి ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చే నిధులు కావని.. గాంధీజి, అంబేద్కర్ తదితర పెద్దలిచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించే నిధులన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ముందుకొచ్చి నామినేషన్లు వేయండి పిలుపునిచ్చారు చంద్రబాబు. మీ గ్రామాలను వైసిపి గుండాల బారినుండి కాపాడాలన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story