12 Dec 2020 3:15 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో ఆలయాలపై దాడులు...

ఏపీలో ఆలయాలపై దాడులు దారుణమని మండిపడ్డ చంద్రబాబు

ఏపీలో ఆలయాలపై దాడులు దారుణమని మండిపడ్డ చంద్రబాబు
X

ఏపీలో ఆలయాలపై దాడులు దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లా పొన్నకల్లులో ఆంజనేయ స్వామి విగ్రహం పెకిలించడం గర్హణీయమని అన్నారు. ప్రభుత్వం, పోలీసుల ఉదాసీనత వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మొదట్లోనే అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తే దురాగతాలకు అడ్డుకట్ట పడేదని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆలయాలు, దేవతా విగ్రహాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని చంద్రబాబు అన్నారు.


Next Story