బిగ్ బ్రేకింగ్.. ప్రమాదానికి గురైన చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్..

చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. వాహన శ్రేణికి ఒక ఆవు అడ్డురావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఎస్కార్ట్ వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జామర్ వాహనం వెనుకే చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం ఉంది. జామర్ కార్ సడన్ బ్రేక్ వేస్తున్న విషయం గమనించి అప్రమత్తమైన చంద్రబాబు కారు డ్రైవర్ వెంటనే తన వాహాన్ని పక్కకు తీశారు. జామర్ వాహనాన్ని NSG-2 వాహనం డీకొట్టింది.
ఈ ప్రమాదం కారణంగా పావుగంటపాటు చంద్రబాబు కాన్వాయ్ రహదారిపైనే నిలిచిపోయింది. NSG వాహనం స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో.. స్పేర్ వాహనంలో NSG సిబ్బందితో కలిసి కాసేపటి తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ముందుగా ప్రమాద విషయం తెలిసి టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. ఐతే.. చంద్రబాబు క్షేమంగానే ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com