Chandrababu : 5 ఏళ్ల పసిపిల్లలను భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడు : చంద్రబాబు

Chandrababu : టీడీపీ యువనేత చింతకాయల విజయ్ ఇంట్లో సీఐడీ పోలీసులు.... దోపిడి దొంగల్లా చొరబడటాన్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పనివాళ్లను భయబ్రాంతులకు గురి చేసేలా సీఐడీ పోలీసులు దారుణంగా వ్యవహరించారన్నారు. ఐదేళ్ల వయస్సున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడాడంటూ ఫైర్ అయ్యారు. కేసులు, విచారణల పేరుతో పోలీసులను రౌడీల్లా ప్రతిపక్ష నేతలపైకి జగన్ రెడ్డి ఉసిగొల్పుతున్నాడంటూ మండిపడ్డారు.
బీసీ నేత అయ్యన్నపాత్రుడు కుటుంబంపై మొదటి నుంచి జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపైనా ఇలాగే దాడి చేశారన్నారు. రాష్ట్రంలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్ట్ తప్ప...ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చేయడం లేదన్నారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే... ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్దతిలో సమాధానం చెప్పాలన్నారు. సీఐడీ లాంటి విభాగాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com