ఆంధ్రప్రదేశ్

చాలాకాలం తరువాత కలుసుకున్న చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు

చాలాకాలం తరువాత చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు కలుసుకున్నాయి. హైదరాబాద్‌లో నందమూరి తారక రామారావు మనవరాలి ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

చాలాకాలం తరువాత కలుసుకున్న చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు
X

చాలాకాలం తరువాత చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు కలుసుకున్నాయి. హైదరాబాద్‌లో నందమూరి తారక రామారావు మనవరాలి ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ వేడుకకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు, చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరించుకుని, మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ తరువాత దగ్గుబాటి, చంద్రబాబు పక్కపక్కనే నిల్చుని ఫొటోలు దిగారు. అటు భువనేశ్వరితో కలిసి పురంధేశ్వరి ఫొటో దిగారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె అయిన ఉమామహేశ్వరి కూతురును పెళ్లి కుమార్తెను చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ దంపతులు, నందమూరి వారసులు హాజరయ్యారు.

ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు హాజరవడం ఎప్పుడూ జరుగుతూనే ఉన్నా.. తోడళ్లులు అయిన నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడమే ఇప్పుడు విశేషం. చాలా రోజులు, ఆమాటకొస్తే చాలా ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి పక్కపక్కన నుంచుని కనిపించినందుకే ఈ ఫొటోలు అంత స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.

పొలిటికల్‌ పార్టీల పరంగానూ, మరికొన్ని కారణాల వల్లా ఈ రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గ్యాప్ ఎలా ఉన్నా.. శుభకార్యాల్లో అంతా కలిసి మాట్లాడుకోవడం, ఆత్మీయంగా పలకరించుకోవడం ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్న గారి కుటుంబంలో ఈ సంతోషకరమైన క్షణాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగుదేశం శ్రేణుల్లో కొందరిని ఈ ఫోటోలు కాస్తంత ఆశ్చర్యానికి గురి చేశాయనే చెప్పాలి. అంతా కలిసిమెలిసిగా ఉండడం చూస్తుంటే మారుతున్న రాజకీయ పరిణామాలకు ఇది సంకేతమా అనే చర్చ కూడా జరుగుతోంది.

Next Story

RELATED STORIES