చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విషెష్‌ తెలుపుతూ ట్వీట్‌ చేశారు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి..సినీ అభిమానుల హృదయాల్లో చిరస్థానాన్ని పదిలపర్చుకున్నారని అన్నారు చంద్రబాబు.సినీ పరిశ్రమ భవిష్యత్తును, కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్‌ చేశారు చంద్రబాబు.

మరోవైపు తన అన్నకు చిరంజీవికి బర్త్‌డే విషెష్‌ తెలిపారు పవన్ కళ్యాణ్.మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశారు.సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుందని,మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ,సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం అంటూ ట్వీట్‌ చేశారు.ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు పవన్‌ కళ్యాణ్‌.

Tags

Read MoreRead Less
Next Story