Chandrababu naidu : నా భార్య విషయం కూడా హౌస్‌లో ప్రస్తావిస్తారా.. చంద్రబాబు కంటతడి

Chandrababu Naidu: సభలోని పరిణామాలు చూస్తోంటే తీవ్ర ఆవేదన కలుగుతోందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు చర్చించారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. స్పీకర్ మౌనంగా ఉంటూ వైసీపీని కట్టడి చేయడం లేదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇవాళ వైసీపీ సభ్యుల తీరుపై సభలోనే నిరసన తెలిపారు చంద్రబాబు. మంత్రి కొడాలి నాని నోరుపారేసుకుంటూ మాట్లాడడంతో దాన్ని తీవ్రంగా ఖండించారు. పోడియం వద్దకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాగైతే సభ నుంచి వాకౌట్ చేస్తామని టీడీపీ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com