22 Jan 2021 11:30 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / చంద్రబాబును గుర్తు...

చంద్రబాబును గుర్తు చేసుకున్న ISB

2001లో హైదరాబాద్‌లో ఐఎస్‌బీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన ఫొటోను తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ట్వీట్ చేసింది.

చంద్రబాబును గుర్తు చేసుకున్న ISB
X

2001లో హైదరాబాద్‌లో ఐఎస్‌బీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన ఫొటోను తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ట్వీట్ చేసింది. 20వ వార్షికోత్సవం సందర్భంగా ISB మాజీ సీఎం చంద్రబాబును గుర్తు చేసుకుంది. 'బిజినెస్ విజనరీలు భవిష్యత్ గురించి ఆలోచించి ISB ప్రాజెక్టును ప్రారంభించారు' అని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ పైన చంద్రబాబు స్పందించారు.. 'నేను కేటాయించిన కొద్దిపాటి స్థలంలో ప్రపంచస్థాయి ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటైంది. అప్పటి ప్రధాని వాజ్‌పేయి, వ్యాపార దిగ్గజాలతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉంది' అని చంద్రబాబు రిప్లై ఇచ్చారు.


Next Story