Chandrababu : వైసీపీ వచ్చాక బెజవాడలో రౌడీమూకలు పేట్రేగిపోతున్నాయి : చంద్రబాబు

Chandrababu : వైసీపీ నేతల దాడిలో కంటికి తీవ్ర గాయమై హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. చెన్నుపాటి గాంధీపై దాడి చాలా దారుణమన్నారు. ఇలాంటి ఉన్మాదాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. గతంలో గొడవలకు మారుపేరుగా ఉన్న విజయవాడను.. తమ ప్రభుత్వ హయాంలో ప్రశాంతనగరంగా మార్చామన్నారు.
వైసీపీ వచ్చాక బెజవాడలో మళ్లీ రౌడీమూకలు పెట్రేగిపోతున్నాయి దుయ్యబట్టారు. ఎమోషనల్‌గా కొట్టారంటూ సీపీ చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. మిమ్మల్ని కూడా ఎమోషనల్‌గా కొట్టి కన్ను పొడగొడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కనీసం కేసు పెట్టకుండా నిందితులకు సీపీ కొమ్ముకాస్తున్నారని ఫైరయ్యారు. ఏపీలో ఎక్కడ చూసినా హత్యా రాజకీయాలు, బెదిరింపులు, దౌర్జన్యాలే కొనసాగుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వవే ఇవి చేయిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com