AP : నేడు కృష్ణాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రచారం

ఎన్డీయే కూటమి ప్రచారం నేడు కృష్ణా జిల్లాకు చేరుకోనుంది. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఇద్దరు నేతలు పెడనకు చేరుకుంటారు.
అక్కడి సభలో ప్రసంగం అనంతరం మచిలీపట్నం నియోజకవర్గానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు విజయవాడకు బయలుదేరతారు. . ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో ఓట్లు బదిలీ అయ్యేలా చూసేందుకు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో స్థానిక బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారు.
మరోవైపు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ తేదీని మే 7వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్ అధికారులను బహిరంగంగా బెదిరిస్తున్నారని, దర్యాప్తుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు కోర్టుకు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

