రామతీర్ధానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు!

రామతీర్ధానికి  చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు!
విజయనగరం జిల్లా రామతీర్థంకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. నడుచుకుంటూ మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లారు చంద్రబాబు.

విజయనగరం జిల్లా రామతీర్ధానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. నడుచుకుంటూ మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్తున్నారు చంద్రబాబు.. ఎన్నీ అడ్డంకులు సృష్టించినప్పటికీ చంద్రబాబు రామతీర్ధానికి చేరుకున్నారు.చంద్రబాబు వెంట అచ్చెనాయుడు, కళా వెంకట్రావు ఉన్నారు. చంద్రబాబు పర్యటనకు ముందు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. లారీలు అడ్డుపెట్టి చంద్రబాబు కాన్వాయ్‌ అడ్డుకునే ప్రయత్నం చేశారు. విజయనగరం ఎత్తు బ్రిడ్జి వద్ద టీడీపీ నేతలను అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. చివరికి పోలీసులు చంద్రబాబు కాన్వాయ్‌ను మాత్రమే అనుమతించారు.

Tags

Read MoreRead Less
Next Story