CM Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

CM Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
X
ఏలూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇచ్చాపురం మండలం, ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి శ్రీకాకుళానికి వస్తున్నారు చంద్రబాబు. ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు నేరుగా ఇవ్వనన్నారు. ఈదుపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడతారు. 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ రోజు మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 2:15 వరకు గ్రామస్తులతో ముఖాముఖి, సభలో ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు సీఎం శ్రీకాకుళం చేరుకుంటారు. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 6:30 వరకు జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రి ఆర్అండ్‌బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. రాష్ట్రంలో దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

అలాగే, ఇవాళ ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో 10 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి నుంచి ద్వారకా తిరుమలకు రోడ్డు మార్గాన రానున్నారు. ద్వారకా తిరుమల మండలం ఐ.యస్ జగన్నాథపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్స్ ను లబ్ధిదారులకు అందజేయనున్నారు పవన్. ఆ తర్వాత ఐ.యస్ జగన్నాథపురంలో కొండపై నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు

Tags

Next Story