చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

తుపాన్ పంట నష్టం సహాయంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో గందరోగళం నెలకొంది. ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడే సమయంలో అధికారపక్ష నేతలు అడ్డుకోవడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో చర్చకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.... స్పీకర్ పోడియం ముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఇవాళ్టి వరకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినా టీడీపీ సభ్యులు సభలోనే నిరసన చేస్తుండడంతో మార్షల్స్ బయటకు తరలించారు.
సస్పెండ్ అయిన వారిలో చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహనరావు, ఆనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, బాలావీరాంజనేయస్వామి, వెలగపూడి అశోక్ బాబు, ఆదిరెడ్డి భవాని, జోగేశ్వర్ రావు, జి. అశోక్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com