Chandra Babu: కర్నూలు జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన..

Chandra Babu: కర్నూలు జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన..
Chandra Babu: కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలోనే పర్యటించనున్నారు.

Chandra Babu: కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలోనే పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.


అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కర్నూలు బైపాస్ రోడ్డు మీదుగా చెన్నమ్మ కూడలి, బళ్లారి చౌరస్తా, కోడుమూరు, దేవన కొండ మీదుగా పత్తికొండ చేరుకుంటారు. అనంతరం పత్తికొండలోని నాలుగు స్తంభాల కూడలిలో రోడ్ షో లో పాల్గొంటారు. ఇక బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు.

మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా పర్యటనను సక్సెస్ చేసేందుకు.. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చంద్రబాబుకు గ్రౌండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. పత్తికొండలో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.


ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పత్తికొండ మొత్తం పసుపు మయంగా మారింది. పట్టణాన్ని చంద్రబాబు ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలతో నింపేశారు... టీడీపీ కార్యకర్తలు. ఇక పత్తికొండలో బాబు టూర్ ముగిసిన అనంతరం అక్కడి నుంచి ఆదోని వెళ్లనున్నారు. ఆదోనిలోని చేకూరి ఫంక్షన్ హాలులో కార్యకర్తలతో సమావేశమై అక్కడే రాత్రికి బస చేస్తారు.

రేపు ఉదయం 10గంటలకు ఆదోని నుంచి ఎమ్మిగనూరు వెళ్తారు. ఆదోనిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ఎమ్మిగనూరు చేరుకుంటారు. ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్ షోతో పాటు తేరుబజారులో బాదుడే- బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు.


ఇక రాత్రికి కర్నూలు చేరుకొని మౌర్య ఇన్ హోటల్లో బస చేయనున్నారు. 18న ఉదయం 10 గంటలకు మౌర్య ఇన్ హోటల్లో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. సమావేశం అనంతరం నగరంలో నూతనంగా నిర్మించిన టీడీపీ కార్యాలయంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇక్కడితో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగియనుంది. ఇక చద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.


Tags

Read MoreRead Less
Next Story