జగన్ సర్కారుపై బాబు సంచలన ట్వీట్

జగన్ సర్కారుపై బాబు సంచలన ట్వీట్
X
జగన్ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీటస్త్రం సంధించారు. నాడు ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తున్న టాప్-5లో ఏపీ ఉండేదన్నారు

జగన్ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీటస్త్రం సంధించారు. నాడు ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తున్న టాప్-5లో ఏపీ ఉండేదన్నారు. నేడు జాబితాలో అట్టడుగు స్థానానికి చేరుకుని 14వ స్థానంలో నిలిచిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క పెట్టుబడిదారుడికి నమ్మకం లేదన్నారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్.. తన సంపద గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. ఎఫ్‌డీఐలు లేదా ఏపీ యువత ఉద్యోగాల గురించి జగన్‌ పట్టించుకోరని చంద్రబాబు విమర్శించారు.

Tags

Next Story