సీఎం జగన్‌కు, డీజీపీకి చంద్రబాబు లేఖ!
జేసీ కుటుంబంలో ఎవరికి ఆపద వాటిల్లినా సీఎం, డీజీపీ బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. జేసీ ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో జేసీ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి సీఎం జగన్‌కు, డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన చంద్రబాబు.. జేసీ కుటుంబానికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బెంబేలెత్తి పోతున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వాళ్లపై చర్యలు లేకపోవడం గర్హనీయమన్న చంద్రబాబు.. బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించడం హేయమని ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com