అదర్శవంతమైన సరస్వతీ నిలయాలన్ని కూల్చడం దారుణం : చంద్రబాబు
విశాఖలోని గీతం యూనివర్సిటీ నిర్మాణాల కూల్చివేతను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎంతోమంది విద్యార్థుల చదువుకు, యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతున్న విశ్వవిద్యాలయ కట్టడాలను కూల్చేయడం వైసీపీ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై విధ్వంసాలకు పాల్పడటం రాష్ట్ర ప్రగతికి చేటు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
కరోనా కష్టకాలంలో సామాజిక బాధ్యతగా..కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2వేల 590మంది కోవిడ్ పేషంట్లకు గీతం యూనివర్సిటీ చికిత్స అందించింది. అలాంటి అదర్శవంతమైన సరస్వతీ నిలయాలన్ని అర్ధరాత్రి 2వందల మందితో వెళ్లి కూల్చడం దారుణమన్నారు చంద్రాబాబు. కట్టడం చేతకాని వారికి కూల్చే హక్కలేదని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్తలపై రాజకీయ కక్షసాధింపు మరో తుగ్గక్ చర్య అన్నారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జగన్ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com