వైసీపీ సభ్యులు రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారు : చంద్రబాబు ఆవేదన

వైసీపీ సభ్యులు రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారు : చంద్రబాబు ఆవేదన

అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ సభ్యులు రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చట్టసభలకు మర్యాదకాద్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చిందన్నారు. కొత్త చట్టల రూపకల్పనపైనా చెప్పాల్సిందేనన్నాకరు చంద్రబాబు..

ఇళ్ల స్థలలాలకు తాము అడ్డుపడుతున్నామంటూ ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు చంద్రబాబు. ఇప్పుడెలా ఇస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదలకు శ్మశానాలు, అవ భూములు, అసైన్డ్ భూములు ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు . కడుపుమండి ఎవరో కోర్టులో కేసులు వేస్తే తమపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు.

ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన అవినీతిని.. సీబీఐ విచారణ వేస్తే నిరూపిస్తామని సవాల్ విసిరారు. సెంట స్థలంలో ఇళ్ల ఎలా కడతారని ప్రశ్నించారు. తాము గ్రామాల్లో మూడు సెంట్లు, నగరాల్లో రెండు సెంట్లు ఇచ్చామన్నారు. సెంటు భూమి ఇచ్చి మురికివాడలు తయారుచేస్తారా అని ఆగ్రహంవ్యక్తంచేశారు..

రాష్ట్రాన్ని పరిపాలించడంలో జగన్‌ సర్కారుకు చేతకావడం లేదంటూ విమర్శించారు చంద్రబాబు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై టీడీపీ నిరతంరం పోరాటం చేస్తుందన్నారు.

Tags

Next Story