నెల్లూరు ధాన్యం రైతులకు రూ.500 కోట్లు నష్టం : చంద్రబాబు

నెల్లూరు ధాన్యం రైతులకు రూ.500 కోట్లు నష్టం : చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. మద్దతు ధర లేక రైతులకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తంచేశారు..

వైసీపీ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. మద్దతు ధర లేక రైతులకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. నెల్లూరు ధాన్యం రైతులకు 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈమేరకు ఓ లేఖను విడుదల చేశారు చంద్రబాబు. పుట్టి ధాన్యానానికి 8వేలు కూడా ధర లభించడంలేదన్నారు. ధరలో సగం కోతపెట్టి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో బీపీటీ ధాన్యం క్వింటాల్‌కు 210 రూపాయలు బోనస్‌ చెల్లించామని తెలిపారు. వరుసగా నాలుగేళ్లలో రెండంకెల వృద్ధిరేటుకు.. వ్యవసాయంలో పురోగతే కారణమని చంద్రబాబు అన్నారు.

వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైసీపీ సర్కారు.... కూర్చున్న కొమ్మనే విరిచేలా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు మొద్దు నిద్ర వీడాలని ధ్వజమెత్తారు. దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. తూకాలలో మోసాలు జరగకుండా చూడాలని అన్నారు. పుట్టి ధాన్యానికి 16 వేల రూపాయల కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

నెల్లూరు జిల్లా రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు సన్నాలు అంటే..2తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవిదేశాల్లో ప్రశస్తి అలాంటి.. నెల్లూరు సన్నాలకు ఎంఎస్‌పీలో సగానికి కూడా కొనేవారు లేక జిల్లా రైతుల ఆవేదన చూస్తుంటే కలిచివేస్తోందన్నారు. వైసీపీ హయాంలో రైతుల వెన్ను విరిచేలా ప్రవర్తిస్తున్నారని తప్పుబట్టారు. యుద్ధప్రాతిపదికన నెల్లూరు ధాన్యం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story