Charishma Krishna: మిస్ సౌత్ ఇండియా 2022 కిరీటం దక్కించుకున్న వైజాగ్ యువతి..

Charishma Krishna: మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ లాంటి పోటీల గురించి చాలామందికి తెలిసినా.. ఈ విభాగంలో చాలామందికి తెలియని పోటీలు కూడా ఉంటాయి. అందులో ఒకటి మిస్ సౌత్ ఇండియా. అయిదు సౌత్ స్టేట్స్ నుండి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొంటారు. ఇక ఈ ఏడాది మిస్ సౌత్ ఇండియా 2022 కిరీటాన్ని దక్కించుకుంది. వైజాగ్ యువతి చరిష్మా కృష్ణ.
ఇటీవల మిస్ సౌత్ ఇండియా 2022 పోటీలు కొచ్చిలో చోటుచేసుకున్నాయి. ఈ పోటీలకు ఎంతోమంది అప్లై చేయగా.. 20మంది ఫైనల్‌కు చేరారు. అందులో చరిష్మా కృష్ణ విన్నర్ కాగా.. డెబ్నితా కర్ ఫస్ట్ రన్నరప్‌గా, సమృద్ధి శెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. విన్నర్‌కు రూ.1 లక్ష, ఫస్ట్ రన్నరప్‌కు రూ. 60,000, సెకండ్ రన్నరప్‌కు రూ.40,000 క్యాష్ ప్రైజ్ కూడా దక్కింది. ఇక మిస్ సౌత్ ఇండియాగా నిలడవంతో చరిష్మా కృష్ణ ఎవరని ప్రజలు ఆరాతీస్తున్నారు.
విశాఖపట్నంలో పుట్టి పెరిగిన చరిష్మా కృష్ణ.. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంది. ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేసింది. చిన్న వయసు నుండే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న చరిష్మా.. 20 స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చింది. అంతే కాకుండా తను గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, యాక్టింగ్‌లాంటి వాటిలో శిక్షణ పొందింది. మిస్ సౌత్ ఇండియాకంటే ముందు తను మిస్ వైజాగ్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com