TIRUMALA: చిరుత సంచారంతో టీడీపీ అప్రమత్తం

TIRUMALA: చిరుత సంచారంతో టీడీపీ అప్రమత్తం
X
అలిపిరి నడకదారిలో సంచారం... భక్తులను అప్రమత్తం చేసిన టీటీటీ

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు చిరుత కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న విజిలెన్స్ అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. చిరుత కదలికల పట్ల భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. దీంతో భద్రత నడుమ భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. చిరుతల సంచారం కలకం రేపుతోన్న వేళ దర్శనానికి వెళ్లే భక్తుల భద్రత కోసం టీటీడీ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఓ వైపు విజిలెన్స్‌ సిబ్బంది గస్తీ ముమ్మరం చేయగా, మరోవైపు అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వెళ్లే భక్తులను సాధారణంగానే అనుమతిస్తున్నారు. ఆ తరువాత మాత్రం శ్రీవారి భక్తులను గుంపులుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.

గతంలో ఇలా....

గతంలో చిరుత సంచారం సమయంలో భక్తులకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు చేతి కర్రలు సైతం పంచడం తెలిసిందే. ఆ సమయంలోనూ సాయంత్రం వేళ భక్తులను గుంపులు గుంపులుగా శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ప్రస్తుతం సైతం ఒక్కోసారి 70 నుంచి 100 మంది భక్తులను శ్రీవారి దర్శనానికి కాలి నడక భక్తులను పంపుతున్నారు. గతంలో లాగే 12 సంవత్సరాలలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల తరువాత నుంచి దర్శనానికి అనుమతించడం లేదని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది సూచించారు. అలిపిరి నడక మార్గాన్ని రాత్రి 9:30 గంటల తరువాత మూసివేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.

Tags

Next Story