కోనసీమలో జోరుగా కోడిపందాలు.. అధికారుల ఆదేశాలు భేఖాతరు చేసిన పందేం రాయుళ్లు
గోదావరి జిల్లాల్లో అధికారుల ఆదేశాలకు భేఖాతరు చేస్తూ కోడి పందేలు ప్రారంభించారు పందెం రాయుళ్లు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. అమలాపురం రూరల్ మండలం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో పోటాపోటీగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. అధికారుల ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.
అటు కాకినాడలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ రూరల్ గ్రామాలైన తిమ్మాపురం, చిడిగి, నేమాం, పండురూ, గుడారిగుంట, సర్పవరం గ్రామాల్లో కోడి పందాలు ప్రారంభయ్యాయి. కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని బీరాలు పలికిన పోలుసులు.. ఇప్పుడు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. కొత్తపేట నియోజవర్గ పరిధిలోని కొత్తపాలెం, వేదిశ్వరం, తాడిపూడి తదితర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్వయంగా కోడి పందాలను ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది.
సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కోడిపందాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఎన్నో నెలలు ముందుగానే ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేసి పందెం కోళ్ల పెంపకం విభిన్న రీతుల్లో చేపడుతుంటారు. సుప్రీంకోర్టు తీర్పు, కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల ఆదేశాలను కాదని ఈ ఏడాది కూడా పందెం రాయుళ్లు జోరుగా కోడిపందాలు నిర్వహించారు. ఎన్ని ఆంక్షలు ఉన్నా పండుగ మూడు రోజులూ ఇక్కడ కోడి పందేలు నిర్వహిస్తున్నారు.
హైకోర్టు ఉత్తర్వులతో గడిచిన పది రోజులుగా పోలీసులు హడావుడి చేశారు తప్ప ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. కోడి పందేల శిబిరాలు వేసే స్థలాల వద్ద పోలీసులు నిఘా పెట్టినా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ పందేలకు భారీగా శిబిరాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నా పందెంరాయుళ్లు మాత్రం వెనుకంజ వేయలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com