ఏపీలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎన్నికల ప్రధానాధికారి భేటీ

ఏపీలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ భేటీ అయ్యారు. సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఎన్నికలు నిర్వహించడంపై చర్చించారు. ముసాయిదా ఓటర్ జాబితా సహా ఇతర అంశాలపై అన్ని పార్టీల నేతలతో చర్చించారు. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించారు సీఈఓ.
Next Story