BIRDFLU: వెలవెలబోతున్న చికెన్ షాపులు

BIRDFLU: వెలవెలబోతున్న చికెన్ షాపులు
X
పడిపోతున్న చికెన్ ధరలు... చేపలు, మటన్‌ వైపు ప్రజల చూపు

ముక్క లేనిదే ముద్ద దిగని తెలంగాణలో ఆదివారం చికెన్ షాపులు వెల వెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. ప్రజలు మటన్, చేపల వైపు పరుగులు పెడుతున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండడంతో తెలంగాణ సర్కారు అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చికెన్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. నాణ్యతగా లేని చికెన్ విక్రయిస్తున్న వ్యాపారులపై ఫుడ్ సేఫ్టే విభాగం కొరడాను ఝులిపిస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా వ్యాపారుల ధోరణి మారకపోవడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు పలు షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడినట్లు తెలిసింది. సుమారుగా 500 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను చూసి అధికారులు షాక్ అయ్యారు. వ్యాపారులపై కేసు నమోదు చేసిన అధికారులు.. కుళ్లిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చికెన్ తినాలనుకుంటున్నారా?

ప్రతి ఇంట్లో ఆదివారం మాంసాహారం తినడం సాధారణ విషయమే. అయితే బర్డ్ ఫ్లూ భయంతో చాలామంది చికెన్, గుడ్లను తినడం మానేశారు. దీంతో మార్కెట్లో చికెన్ ధరలు తగ్గడంతో ప్రౌల్టీ రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. కానీ నిపుణులు బర్డ్ ఫ్లూ విషయంలో భయం లేదని, చికెన్‌ను బాగా వేడి చేసి వండితే సురక్షితమేనంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు జనాలు చికెన్ వైపు మొగ్గు చూపుతారా? రిస్క్ ఎందుకుని వేరే మాంసం వైపు చూస్తారా చూడాలి.

బిర్యానీలపై బర్డ్ ఫ్లూ ప్రభావం

బర్డ్ ఫ్లూ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఈ క్రమంలో చికెన్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న మటన్, ఫిష్ కొనుగోలుకు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో వాటి ధరలు అంతకంతకూ పెరిగాయి. అయితే బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ మానుకోవాల్సిన అవసరం లేదని.. 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో చికెన్ ఉడికిస్తే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Next Story