దళిత యువకుడు మృతి కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దళిత యువకుడు మృతి కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చీరాల దళిత యువకుడు కిరణ్‌కుమార్ మృతి కేసులో ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా ఈ కేస్‌ను సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదు అని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ పట్ల కిరణ్ కుమార్ తల్లిదండ్రులు సంతృప్తి చెందారని కేస్ కొట్టేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వంలో ఎవరినైనా మీరు సంతృప్తి పరచగలరంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. కిరణ్ కుమార్‌తో పాటు ఉన్న సహ నిందితుడి ఫోన్ కాల్ రికార్డ్ ఇస్తామని న్యాయవాది శ్రవణ్ తెలుపగా.. అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో స్వాతంత్ర సంస్థ సీబీఐతో ఎంక్యూరీ చేయించే అర్హత కలిగి ఉందని కోర్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపు పూర్తి వివరాలు అందించేందుకు రెండు వారాలు సమయం కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. కిరణ్ కుమార్ తరపున మాజీ ఎంపీ హర్షకుమార్ పిటిషన్ వేశారు. బాధితుడి తరపున హైకోర్టు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. విచారణకు ముందు మృతుడి తల్లిదండ్రుల్ని ప్రలోభాలకు గురి చేశారని కోర్టుకు విన్నవించారు.

Tags

Read MoreRead Less
Next Story