ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు
ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు చేస్తోంది. నెల్లూరులోని నారాయణ నివాసానికి పోలీసులు వచ్చారు. మూడు ప్రత్యేక వాహనాల్లో అధికారులు చేరుకున్నారు. హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణ ఇంటి లోపలకు, లోపలి నుంచి బయటకు ఎవ్వరినీ అనుమతించలేదు అధికారులు.
మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసులో చంద్రబాబుతో పాటు నారాయణపై కూడా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ KPHB లోధా టవర్స్‌లోని నారాయణ ఇంటికి సీఐడీ బృందం వచ్చినప్పటికీ.. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈనెల 22న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో నారాయణను ఏ2గా చేర్చింది ఏపీ సీఐడీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com