మందడంలో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం

మందడంలో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం నేపథ్యంలో మందడం దీక్షా శిబిరం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు..

ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం నేపథ్యంలో మందడం దీక్షా శిబిరం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కేబినెట్ సమావేశం ముగిసేవరకూ రైతులు, మహిళలు ఎవరూ శిబిరానికి రావొద్దని పోలీసులు సూచించారు. ఐతే.. మందడం దగ్గర రైతులు దీక్షకు కూర్చోవడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు-రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఆంక్షలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న అమరావతిని అభివృద్ధి చేయకుండా.. ప్రభుత్వం 3 రాజధానులకు నిధుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తుండడం హాస్యాస్పదమటున్నారు. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా.. ఉన్న రాజధానిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story