గుంటూరు జిల్లా వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

గుంటూరు జిల్లా వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది.. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.. ఘర్షణలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. గ్రామంలో రోడ్డు కాంట్రాక్టు విషయంలో మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది.. గ్రామంలో పరస్పర దాడులకు దిగిన రెండు వర్గాలు.. అక్కడితో ఆగలేదు.. చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా, అక్కడ కూడా ఘర్షణకు దిగారు.. చేతికందిన కర్రలు, రాడ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు.. అటు ఇరువర్గాల ఘర్షణతో కట్టుబడివారిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags

Next Story