కడప జిల్లా వైసీపీలో వర్గపోరు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ
కడప జిల్లా వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. కొండాపురం మండలం పి.అనంతపురంలో రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.. ఈ ఘటనలో గురు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చనిపోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.. గాయపడిన వారికి తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గండికోట నిర్వాసితులకు చెక్కుల విషయంలో రీ సర్వే చేస్తుండగా వివాదం తలెత్తింది.. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దారితీసింది.. అప్పటికే తెచ్చుకున్న కర్రలతో దాడులు చేసుకున్నారు.. ఈ ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.. పి.అనంతపురం గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.. మరోవైపు పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com