రాష్ట్రానికి రూ.4లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు

రాష్ట్రానికి రూ.4లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు
X
నేడు జీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో పాల్గొనున్న సీఎం

రాష్ట్రానికి రూ.4లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పెట్టుబడులతో దాదాపు 4 లక్షల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.31వేల కోట్లు సమకూర్చామని, గ్రామసభల ద్వారా తలపెట్టిన అభివృద్ధి పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతాయని సీఎం పేర్కొన్నారు.

Vision-2047లక్ష్యాలు ఇవే..

ఏపీ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు విజన్‌ 2047 ప్రారంభించారు. ఇందులో చాలా లక్ష్యాలు ఉన్నాయి. జీఎ్సడీపీలో 15 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రాబోయే 25ఏళ్లలో అదే కొనసాగాలని సంకల్పించారు. 2014-19మధ్య 13.5 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. 15శాతానికి పెరగాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం లక్ష్యాలుగా విజన్‌-2047 ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు.

వచ్చేదంతా వాట్సప్‌ గవర్నెన్స్‌

వచ్చేదంతా వాట్సప్‌ గవర్నెన్స్‌ అని.. అందుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించు­కో­వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతిమంగా ‘వాట్సప్‌ గవర్నెన్స్‌’ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాల­న్నారు. ప్రజలు కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీక­రణ వంటి అన్ని ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు వాట్సప్‌ను వేదిక చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలన్నారు. జీరో పేదరికం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మరో కీలక అంశం. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గాలి’’

రానున్న 20 ఏళ్లలో 15% వృద్ధి: చంద్రబాబు

రానున్న 20 ఏళ్లలో 15% వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు (బుధవారం) కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన, సంక్షోభంలో కూడా అవకాశాలను సృష్టించుకోవడమే నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు. అయితే ప్రయత్నించిన వెంటనే ఏదీ రాదని, అవిరామంగా ప్రయత్నిస్తేనే ఫలితం ఉంటుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి 20 నూతన విధానాలను తీసుకొచ్చినట్టు బాబు పేర్కొన్నారు.

Tags

Next Story