నేడు మరోసారి పులివెందులకు సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో నేతృత్వంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లు కాకుండా సీఎం టూర్‌లో స్వల్ప మార్పు జరిగింది. రెండు రోజులక్రితం మరణించిన జగన్మోహన్ రెడ్డి మామ గంగిరెడ్డి కర్మకాండ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకొని.. అక్కడ కార్యక్రమం ముగియగానే ఢిల్లీకి బయలుదేరుతారు.
ఢీల్లీ టూర్‌లో భాగంగా కృష్ణా జలాల్లో ఏపీ రాష్ట్రానికి రావలసిన న్యాయబద్ధమైన వాటానే కోరదామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇదివరకే జలవనరుల శాఖకు సూచించారు. దీనిలో భాగంగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్-ఇన్-చీఫ్ సి.నారాయణరెడ్డి తదితరులతో సీఎం సమావేశమై చర్చించారు. శ్రీశైలం జలాశయం పర్యవేక్షణను తమకు అప్పగించాలంటూ షెకావత్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడంతో రాష్ట్ర జల వనరుల నిపుణులు కొంత ఆందోళన చెందుతున్నారు.