హడావుడిగా ఢిల్లీ వెళ్లినా.. నిరాశే మిగిలిందా?

హడావుడిగా ఢిల్లీ వెళ్లినా.. నిరాశే మిగిలిందా?
సీఎం జగన్‌... హడావుడిగా ఢిల్లీ వెళ్లినా.. నిరాశే మిగిలిందా?వెళ్లారు. రెండు సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఇద్దరూ అరగంటకుపైగా చర్చలు..

సీఎం జగన్‌... హడావుడిగా ఢిల్లీ వెళ్లినా.. నిరాశే మిగిలిందా?వెళ్లారు. రెండు సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఇద్దరూ అరగంటకుపైగా చర్చలు జరిపారు. ఉదయం మళ్లీ షా ను కలిసి మాట్లాడారు. అయితే.. ఈ పర్యటనలో జగన్‌ లక్ష్యాలు నెరవేరలేదనే తెలుస్తోంది. ప్రధానంగా 3 అంశాలపై సీబీఐ విచారణ కోసం సీఎం జగన్ విఫలయత్నం చేసినట్లు సమాచారం. రాజధాని భూములు, ఫైబర్ గ్రిడ్, అంతర్వేది ఘటనలపై సీబీఐ విచారణకు ఆయన పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం మాత్రం నో చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. రాష్ట్ర పరిధిలోని సంస్థలతోనే దర్యాప్తు చేయించుకోవాలని హోంమంత్రి అమిత్‌షా తేల్చిచెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాజధాని భూములు, ఫైబర్ గ్రిడ్, అంతర్వేది ఘటనలపై సీబీఐ విచారణ కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఈ అంశాల్లో సీబీఐ విచారణ కేవలం రాజకీయకోణమని కేంద్రం భావిస్తోంది. ఐతే.. ఎలాగైనే అమిత్‌షాను ఒప్పించాలన్న లక్ష్యంతోనే సీఎం జగన్‌ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండుసార్లు షాతో సమావేశమై దీనిపైనే పట్టుబడినట్లు సమాచారం. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై 18 పేజీల లేఖను అమిత్‌షాకు అందజేశారు‌. అటు.. ఏపీలో పరిణామాలపై ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లు తెప్పించుకుంటున్న అమిత్‌షా.. అభివృద్ధి అంశాలపై కేంద్రం పూర్తిగా సహకరిస్తుందనే హామీ వచ్చినా.. CBI విచారణకు ససేమీరా అన్నట్లు తెలుస్తోంది.

అమరావతిలో భూముల కొనుగోళ్లు అమ్మకాలలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వైసీపీ ప్రభుత్వం ఆరోపణ. భూలావాదేవీలపై సబ్ కమిటీ నివేదిక ఇచ్చినా అందులోని అన్ని అవాస్తాలున్నాయనేది విపక్షాల మాట. రాజధాని ఎక్కడో అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన వచ్చాక జరిగిన కొనుగోళ్లు కూడా అవినీతే అని చెప్పడంపై తీవ్రమైన విమర్శలే వచ్చాయి. ఇక... ఏపీ ఫైబర్ గ్రిడ్‌లోనూ అవినీతి జరిగిందంటున్న వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతోంది. ఐతే.. చంద్రబాబు, లోకేష్ ఈ ఆరోపణల్ని ఖండించారు. ఇటు, అంతర్వేది ఘటనలో హిందూ సంఘాల నుంచి తీవ్రవిమర్శలు రావడంతో ఈ అంశంపైనా సీబీఐ విచారణ కోరుతోంది జగన్‌ సర్కారు..

ఏపీలో జరుగుతున్న పరిణామాల్ని రాష్ట్ర బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు పంపిస్తునే ఉన్నారు. భూముల వ్యవహారంతోపాటు, అంతర్వేది ఘటనపై కేంద్రానికి కొన్ని ఫిర్యాదులు కూడా అందాయి. అందుకే సీఎం జగన్ విచారణకు కోరిన అంశాలకు OK చెప్పేందుకు అమిత్‌షా నిరాకరించారని సమాచారం. రాష్ట్ర పరిధిలో విచారణ జరిగే అవకాశం ఉన్న అంశాల్లో అక్కడే వాటిని పూర్తి చేయాలని, సీబీఐపై అదనపు భారం వెయ్యడం సరికాదని అమిత్‌షా అన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఒకవేళ ఈ 3 అంశాల్లో ఏదైనా అంశంపై కచ్చితంగా సీబీఐతోనే విచారణ జరిపించాలంటే కనుక, అందుకు సంబంధించిన అదనపు సమాచారం మొత్తం ఇవ్వాలని, వాటిని పరిశీలించాక ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు తెలుస్తోంది.

తాను అనుకున్న అంశాలపై CBI విచారణ కోసం కేంద్రం పెద్దలతో మాట్లాడేందుకు వెళ్లిన సీఎం జగన్ అడ్వకేట్ జనరల్‌ శ్రీరామ్‌, అడ్వకేట్ భూషణ్‌ను, CMO ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను వెంట తీసుకువెళ్లారు. కేంద్రం ఏదైనా సమాచారం కోరితే వాటిని అందించేందుకు ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ.. సీబీఐ విచారణ విషయంలో అమిత్‌షా నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో జగన్ వర్గానికి నిరాశ తప్పలేదనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story