జగన్ కు బిగ్ షాక్.. సీబీఐ విచారణకు 'అమిత్ షా' నో?

ఢిల్లీ పర్యటనలో 3 అంశాలపై సీబీఐ విచారణ కోసం సీఎం జగన్ విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. రాజధాని భూములు, ఫైబర్ గ్రిడ్, అంతర్వేది ఘటనలపై సీబీఐ విచారణకు ఆయన పట్టుబడుతున్నారు. అయితే కేంద్రం మాత్రం అవసరం లేదన్న భావనలో ఉంది. జగన్‌కు అదే విషయం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తేల్చిచెప్పినట్లు సమాచారం. రాష్ట్ర పరిధిలోని సంస్థలతోనే చూసుకోవాలని స్పష్టం చేసినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ మూడు అంశాలపై సీబీఐ విచారణ కోరుతూ ఇప్పటికే కేంద్రానికి ఏపీ లేఖ రాసింది. అయితే సీబీఐ విచారణ కేవలం రాజకీయమని కేంద్రం భావిస్తోంది. అమిత్‌షాను ఒప్పించేందుకు సీఎం జగన్ విఫలయత్నం చేసినట్లు సమాచారం. నిన్న, ఇవాళ కూడా అమిత్‌షాతో ఇదే అంశంపై చర్చించారని తెలుస్తోంది. అత్యవసరంగా ఈ అంశాలపై మాట్లాడేందుకే జగన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఐతే.. ఏపీలో పరిణామాలపై ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లు తెప్పించుకుంటున్న అమిత్‌షా.. సీబీఐ విచారణకు నో చెప్పినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై 18 పేజీల లేఖను సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అందచేశారు. అభివృద్ధి అంశాలపై కేంద్రం పూర్తిగా సహకరిస్తుందనే హామీ వచ్చినా.. CBI విచారణ విషయంలో మాత్రం ఆ అవసరం లేదనే ఆలోచనలో అమిత్‌షా ఉన్నట్టుగా సమాచారం.