పోలవరంపై చేతులెత్తేసిన సీఎం జగన్‌

పోలవరంపై చేతులెత్తేసిన  సీఎం జగన్‌
గతంలో సొంతంగానే నిధులిస్తానని హామీ.. ఇప్పుడు దేవుడి దయ అంటూ హ్యాండ్సప్‌

పోలవరంపై ఏపీ సీఎం చేతులెత్తేశారు. అవును..కేంద్రం నిధులిస్తేనే పోలవరం ప్రాజెక్టులో పునరావాస కార్యక్రమం ముందుకు సాగుతుందని జగన్‌ అన్నారు.అంతేకాదు పోలవరం నేను కట్టడం లేదు. కేంద్రం కడుతోంది. వారిని ఒప్పించి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నేనైతే ముందుగా మీకు పునరావాసం పూర్తిచేశాకే ప్రాజెక్టు కట్టేవాడిని అంటూ తన అసహాయత బయట పెట్టేశారు.

ఇక ప్రత్యేక హోదా నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం వరకు...సీఎం జగన్‌ది ఓకే మాట..దేవుడు దయతలచాలి. కేంద్రం సహకరించాలి. అంతా కేంద్రం చేస్తే మరి... రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనేం చేస్తారు? ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి... అధికారంలోకి వచ్చాక ముంచేయడమేనా? అన్న విమర్శలు నిర్వాసితుల నుంచి వస్తోంది. మరోవైపు కేంద్రం సాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందని పోలవరానికి గతేడాది జూలై 27న పోలవరం నిర్వాసితులకు జగన్‌ హామీ ఇచ్చారు. ఏడాదిపాటు పైసా ఇవ్వకుండా ఇప్పుడు చేతులెత్తేశారు. అయితే జగన్‌ నాడు ఓ మాట నేడు ఓ మాట మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.నవరత్నాలు, బటన్‌ నొక్కుడు తప్ప జగన్‌ చేసిన అభివృద్ధి ఏమిలేదని విమర్శిస్తున్నారు.

కేంద్రం దయతలిస్తేనే పరిహారం ఇస్తామని తేల్చేశారు. భూములిచ్చిన రైతులకు మరో 3లక్షల85 వేల అదనపు పరిహారం ఇస్తానని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద 10 లక్షల వరకు ఇస్తామని తానిచ్చిన హామీ గుర్తుందన్నారు. కేంద్రం తన వాటా పరిహారం ఎప్పుడైతే చెల్లిస్తుందో, అప్పుడే రాష్ట్ర వాటా కలిపి ఇస్తామన్నారు.దేవుడి దయ, కేంద్రం చలవ ఉంటే ఈ నెలాఖరుకల్లా కేంద్ర కేబినెట్‌లో పోలవరం పరిహారం అంశం చర్చకు రావచ్చని చెప్పారు.

మరోవైపు ఆర్‌అండ్‌ఆర్‌ తన చేతుల్లో ఉండే పనికాదు.కేంద్రంపైనే ఆధారపడాల్సి వస్తోంది.వారిపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేతనైనకాడికి చేస్తున్నాన్నారు. కాంటూరులో మొదట నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని...కేంద్రంపై ఒత్తిడి తెచ్చి లైడార్‌ సర్వే చేయించామని తెలిపారు. పరిహారం చెల్లింపుపై కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం కుస్తీలు పడుతున్నామని అన్నారు. తమ ప్రభుత్వం వైఫల్యాలను గత టీడీపీ ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేశారు సీఎం జగన్‌. గత ప్రభుత్వంలో స్పిల్‌వే కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టారని..దీంతో ప్రధాన డ్యాం నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందని,డయాఫ్రం వాల్‌ను కొత్తగా నిర్మించాల్సి వస్తోందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story