23 Sep 2020 11:35 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అన్నమయ భవన్‌లో బస...

అన్నమయ భవన్‌లో బస చేసిన సీఎం.. సడన్‌గా తిరుమలకు కొడాలి నాని

అన్నమయ భవన్‌లో బస చేసిన సీఎం.. సడన్‌గా తిరుమలకు కొడాలి నాని
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల చేరుకున్నారు. ఇవాళ శ్రీవారికి గడువ సేవ సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. డిక్లరేషన్‌పై వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో CM కచ్చితంగా సంతకం చేసే దర్శనానికి వెళ్లాలనేది హిందూ సంఘాల పట్టు. విపక్షాలు కూడా ఇదే విషయంపై ముఖ్యమంత్రిని నిలదీస్తున్నాయి. ఇవాళ CM రాక సందర్భంగా ఉదయం నుంచే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా TDP శ్రేణులు నిరసనకు దిగడంతో.. పలువురు నేతల్ని హౌస్ట్ అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకూ భారీగా పోలీసుల్ని మోహరించారు. తిరుపతిలో కూడా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కొనసాగించే విషయంలో CM జగన్‌, వైసీపీ నేతలకు మొండిపట్టుదల తగదని హిందుత్వవాదులు మండిపడుతున్నారు.

ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుమల చేరుకున్న జగన్‌ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అన్నమయ భవన్‌లో బస చేసిన సీఎం.. కాసేపట్లో కోవిడ్ నియంత్రణపై ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. తర్వాత బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. మంత్రి కొడాలి నాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. డిక్లరేషన్‌పై మొదట్నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆయన సడన్‌గా తిరుమలకు వెళ్లారు. అక్కడకు వెళ్లి తాజాగా ఆయన మోదీనీ వివాదంలోకి లాగారు.

  • By kasi
  • 23 Sep 2020 11:35 AM GMT
Next Story