CM Jagan : సీఎం బస్సు యాత్రతో ప్రజలకు అవస్థలు
![CM Jagan : సీఎం బస్సు యాత్రతో ప్రజలకు అవస్థలు CM Jagan : సీఎం బస్సు యాత్రతో ప్రజలకు అవస్థలు](https://www.tv5news.in/h-upload/2024/04/19/1241568-1200-675-21254505-thumbnail-16x9-traffic.webp)
జగన్ బస్సు యాత్రకు ప్రజలు ముఖం చాటేస్తుండటంతో... జనసమీకరణ కోసం ఉభయ గోదావరి జిల్లా వైకాపా నేతలు ఆపసోపాలు పడ్డారు. మనిషికి 200 రూపాయలతోపాటు వాహనదారులకు పెట్రోల్‌కు కూపన్లు ఇచ్చారు. జాతీయ రహదారిపై ప్రతికూడలి వద్ద ట్రాఫిక్ నిలిపియడంతో... మండుటెండలో జనం నానా అవస్థలు పడ్డారు. పలు చోట్ల వాహనదారులు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.
'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు జనం స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో... కోనసీమ జిల్లా రావులపాలెంకు వైకాపా నేతలు జనాన్ని తరలించారు. మనిషికి 200 రూపాయల చొప్పున చెల్లించి... ద్విచక్ర వాహనానికి 200 పెట్రోల్ కూపన్ ఇచ్చారు. వైకాపా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో.... రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల నుంచి జగన్ బస్సు యాత్ర... జాతీయ రహదారిపైకి తీసుకొచ్చారు. స్థానికంగా స్పందన అంతంత మాత్రమే ఉండటంతో ...కొత్తపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైకాపా శ్రేణుల్ని తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపియడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జగన్ ఎన్నికల బస్సు యాత్రతో ఉభయగోదావరి జిల్లా ప్రజల తీవ్ర అవస్థలు పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం మీదగా రావులపాలెం పర్యటనలో జాతీయ రహదారిపై రెండువైపులా వాహనాలను నిలిపివేశారు. వందలాది వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించాయి. సిద్ధాంతం కూడలి నుంచి గోదావరి బ్రిడ్జి వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. జగన్ వస్తున్నారని అడుగడుగునా వాహనాలను ఆపివేయడంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com