డిక్లరేషన్‌పై వార్.. ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమల వరకూ పోలీసుల మోహరింపు

తిరుమల డిక్లరేషన్‌పై వార్ నడుస్తోంది.. ముఖ్యమంత్రి జగన్ తిరుమల చేరుకోనున్నారు.. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. ఈ నేపథ్యంలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టి జగన్ తిరుమల ఆలయంలో అడుగు పెట్టాలని హిందూ సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. జగన్ పర్యటన సందర్భంగా నిరసన తెలుపుతున్నాయి.. అటు విపక్షాల నిరసనలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.. ఎయిర్ పోర్టు8 నుంచి తిరుమల వరకు అడుగడుగునా పోలీసులు మోహరించారు.
అటు డిక్లరేషన్ విషయంలో అధికార వైసీపీ, విపక్షాల మధ్య వార్ నడుస్తోంది.. డిక్లరేషన్ విషయమై టీటీడీ ఈవోకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి లేఖ రాశారు.. జగన్ నుంచి డిక్లరేషన్ కోరి శ్రీవారి ఆలయ సంప్రదాయాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. అటు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పరిపూర్ణానంద సహా హిందూ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి.. సంప్రదాయాలతో ఆటలెందుకని ప్రశ్నిస్తున్నాయి.. అయితే, డిక్లరేషన్ విషయంలో విపక్షాల డిమాండ్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తంగా ఇటు తిరుపతి, అటు తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.