డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే జగన్‌ ఆలయంలో అడుగుపెట్టాలి :పరిపూర్ణానందస్వామి

డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే జగన్‌ ఆలయంలో అడుగుపెట్టాలి :పరిపూర్ణానందస్వామి
తిరుమల చేరుకున్న జగన్‌కు టీటీడీ ఛైర్మన్, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

తిరుమల శ్రీవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. డిక్లరేషన్‌పై వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో CM కచ్చితంగా సంతకం చేసే దర్శనానికి వెళ్లాలని హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. విపక్షాలు కూడా ఇదే విషయంపై ముఖ్యమంత్రిని నిలదీస్తున్నాయి. తరాల నుంచి వస్తున్న సంప్రదాయాలను గౌరవించాలని హితవు పలుకుతున్నారు.. తిరుమల ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లకు విలువ ఇవ్వాలంటున్నారు. అటు CM రాక సందర్భంగా ఉదయం నుంచే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా TDP శ్రేణులు నిరసనకు దిగడంతో.. పలువురు నేతల్ని హౌస్ట్ అరెస్ట్ చేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకూ అడుగడుగునా పోలీసులే కనిపించారు. తిరుపతిలో కూడా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కొనసాగించే విషయంలో CM జగన్‌, వైసీపీ నేతలకు మొండిపట్టుదల తగదని హిందుత్వవాదులు మండిపడుతున్నారు.


తిరుమల చేరుకున్న జగన్‌కు టీటీడీ ఛైర్మన్, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.రాత్రి 7 గంటలకు సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కోవిడ్ నియంత్రణపై ప్రస్తుతం అన్నమయ భవన్ నుంచి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్‌ పాల్గొంటున్నారు.. వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. మంత్రి కొడాలి నాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. డిక్లరేషన్‌పై మొదట్నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆయన సడన్‌గా తిరుమలకు వెళ్లారు. అక్కడకు వెళ్లి తాజాగా ఆయన మోదీనీ వివాదంలోకి లాగారు. అటు, సీఎంతోపాటు ఐదుగురు మంత్రులు కొండపైకి వెళ్లారు. హోమంత్రి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ కూడా గరుడ సేవలో పాల్గొననున్నారు.

డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే జగన్‌ ఆలయంలో అడుగు పెట్టాలని పరిపూర్ణానందస్వామి స్వామి డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాళ్లెవరూ ఇప్పటి వరకు బాగుపడలేదని గుర్తించాలన్నారు. హిందూ సంప్రదాయాన్ని అగౌరవ పరిచే వారెవరూ హిందువులు కారని పరిపూర్ణానంద అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story