వరద ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన

పోలవరం ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. సీఎం పర్యటన నేపథ్యంలో గొమ్ముగూడెం పూర్తిగా పోలీసుల నిర్బంధంలోకి వెళ్లిపోయింది. అనవసర ఆంక్షలతో వరద బాధితులను కూడా ఇబ్బందులు పెట్టారు. వరదల వల్ల రెండు వారాలుగా స్థానికులు చాలామంది దాచారం పునరావాస శిబిరంలో ఉంటున్నారు. సీఎంను కలిసి సమస్యలు చెబుదామనుకుని కొందరు రాగా, వారిని ఆపేశారు.ఇటు వరద బాధితులను అనుమతించకపోగా, మరోవైపు డ్వాక్రా మహిళలను భారీ ఎత్తున పాసులు జారీ చేసి మరీ పంపించారు. వారిని బారికేడ్లకు ఇరువైపులా నిలబెట్టారు. సీఎం వస్తుంటే మమ్మల్నే అనుమతించకపోతే ఎలా అంటూ వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే సీఎంతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి వరద బాధితుల పేరుతో వైసీపీ అనుచరులు, నేతలకే అవకాశం కల్పించారన్న విమర్శలు వస్తున్నాయి. వారంతా సీఎం బాగా పనిచేస్తున్నారంటూ భజన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యల్ని ప్రస్తావించనేలేదు. వరదలు వచ్చినా మాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నారని. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు అంటూ కీర్తించారు. అయితే జగన్ పర్యటన వరద బాధితులను పరామర్శించడానికి అన్నట్లు లేదని జగన్ ను ఆహో.. ఓహో అని పొగిడించుకోవడానికే అన్నట్లు ఉందని టీడీపీ ఆరోపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com